- Advertisement -
టోక్యో : ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను నిర్మూలించేందుకు సంఘటితం కావాల్సి ఉందని ప్రపంచనేతలకు జపాన్ పిలుపు నిచ్చింది. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచం ఒక్కటవుతోంది, ఇదే విధంగా అణ్వాయుధ బెడదను తిప్పికొట్టేందుకు ఏకం కావాలని కోరింది. ప్రపంచంలో తొలిసారి అణుబాంబు దాడికి జపాన్ గురయి 76 ఏండ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో టోక్యో మేయర్ కుజుమి మత్సూయి శుక్రవారం మాట్లాడారు. అణ్వాయుధం ఊసులేని ప్రపంచం ఇప్పుడు అవసరం. కరోనా వైరస్ బెడద లేకుండా అంతా పాటుపడుతున్నారు. వైరస్‌ను మించిన ముప్పును తెచ్చిపెట్టే అణ్వాయుధాన్ని సంఘటితంగా తిప్పికొట్టాల్సి ఉందని మేయర్ తెలిపారు. వైరస్, అణ్వాయుధం ఈ రెండూ మానవాళికి మన మనుగడకు ముప్పును కొని తెస్తున్నాయి. ఇప్పుడు సంపూర్ణ రీతిలో అణ్వాయుధ రహిత ప్రపంచం మన అందరి అభిలాష కావాల్సి ఉందని తెలిపారు.
- Advertisement -