Thursday, September 19, 2024

ట్రిబ్యునల్స్ ఉండాలా, వద్దా?

- Advertisement -
- Advertisement -

Do you intend to close tribunals Says Supreme Court

అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పది రోజుల్లోగా స్పష్టమైన సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశం

నూఢిల్లీ: దేశంలోని వివిధ ట్రిబ్యునల్స్‌లో ఖాళీలను ఖర్తీ చేయని అధికారుల తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్స్ ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్స్‌పై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రిబ్యునల్స్ లేకుంటే మంచిదని బ్యూరోక్రసీ భావిస్తోందా అని సిజెఐ ప్రశ్నించారు. అధికారుల తీరు చూస్తే అలాగే అనిపిస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. ట్రిబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా?వద్దను కుంటున్నారా? తదుపరి విచారణ సమయంలో ఈ విషయం తప్పక చెప్పాలని సొలిసిటర్ జనరల్‌ను సిజెఐ ఆదేశించారు. జిఎస్‌టి చట్టం అమలులోకి వచ్చి నాలుగేళ్లయినా జాతీయ, ప్రాంతీయ ట్రిబ్యునల్‌సను ఏర్పాటు చేయకపోవడంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పది రోజుల్లో తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. టిడి శాట్, ఎన్‌సిఎల్‌టి, ఎన్‌సిఎల్‌ఎటి, సెక్యూరిటీ అప్పెలేట్ ్రట్రిబ్యునల్ లాంటి 15 ట్రిబ్యునల్స్‌లో 19 ప్రిసైడింగ్ అధికారులు లేదా చైర్మన్ స్థాయి పోస్టులు ఖాళీ ఉండగా, మరో 200కు పైగా జ్యుడీషియల్, టెక్నికల్ సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News