Sunday, September 22, 2024

చేనేత మిత్ర కింద 50 శాతం సబ్సిడీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

50% Subsidy under hand loom sector

హైదరాబాద్: స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పివి మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. చేనేత కాళాకారులను, చేనేత రంగంలో విశిష్ట కృషి చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తోందన్నారు. చేనేత రంగంలో కృషి చేసిన వారికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో పురస్కారాలు ఇస్తున్నామన్నారు. ఈ కామర్స్ రంగాన్ని అందిపుచ్చుకుంటూ గోల్కొండ పోర్టల్ ద్వారా చేనేతల అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. నవతరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా చేనేతలను తీర్చిదిద్దుతున్నామని, కొత్త ఆలోచనలను పోత్సహించేందుకు టెస్కో ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఉమ్మడి ఎపిలో చేనేత రంగానికి కేటాయించిన నిధుల కంటే పది రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. చేనేతలను ఆదుకునేందుకు వివిధ పథకాల కింద పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నామని, చేనేత మిత్ర కింద రంగులు, రసాయనాలు, ముడి సరుకుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ ప్రశంసించారు. నేతన్నకు చేయూత దారా భరోసా కల్పిస్తున్నామన్నారు. 2010-17 వరకు ఉన్న చేనేత కార్మికుల రుణాలు రూ.28.96 కోట్లు మాఫీ చేశామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను కోరామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News