ఏడు కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ : నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయి, హోండా యాక్టివా బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని లకిడికాపూల్‌కు చెందిన మనోహర్ సింగ్ అలియాస్ సన్నీ క్లాత్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో గత కొంత కాలం నుంచి గంజాయి విక్రయిస్తున్నాడు. ఎపిలోని నర్సిపట్నంకు చెందిన శ్రీను గంజాయి నగరానికి సప్లయ్ చేస్తున్నాడు. మనోహర్ సింగ్, శ్రీను వద్ద రెండు కిలోలకు రూ.5వేలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి రూ.10,000, 12,000లకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు బైక్‌పై గంజాయి పెట్టుకుని సోమాజిగూడలోని పార్క్ హోటల్లో వద్ద అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.