Saturday, November 23, 2024

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విలయ తాండవం

- Advertisement -
- Advertisement -
7 lakh Covid cases in single day worldwide
ఒక్క రోజులో 7 లక్షల కేసులు

వాషింగ్టన్ /బీజింగ్ : ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనా లోనూ కేసులు బయటపడుతున్నాయి. దాదాపు రెండున్నర నెలల్లో ఎన్నడూ లేని విధంగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. వరల్డ్ మీటర్ గణాంకాల ప్రకారం మే 11 తరువాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అమెరికాలో గత మూడు రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో గురువారం 24 గంటల్లో 1.20 లక్షల మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. అత్యధికంగా ఫ్లోరిడాలో 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడగా, టెక్సాస్ , కాలిఫోర్నియాల్లో ఈ సంఖ్య 10 వేలు దాటింది.

అమెరికాలో ఫిబ్రవరి రెండో వారం తరువాత మళ్లీ ఈ వారం లోనే రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. చైనాలో డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 80 మంది కొవిడ్ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా చైనాలో బయటపడిన కేసుల సంఖ్య 1200 దాటింది. బ్రెజిల్‌లో గురువారం 24 గంటల్లో 40 వేల మందికి పైగా కొవిడ్ బారిన పడగా, 1086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియాలో 1700 మందికి పైగా మృతి చెందారు. రోజువారీ కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్ లోనూ ఒక్క రోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో తాజాగా 30,215 మందికి కొవిడ్ సోకింది. రష్యా, టర్కీ, ఫ్రాన్స్, మెక్సికోల్లోనూ 20 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News