హైదరాబాద్: పాటియాలలో జరుగుతున్న భారత అథ్లెటిక్స్ జూనియర్ క్యాంప్ లో ఉన్న తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నందిని జూనియర్ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో భారత్ తరపున పాల్గొంటోంది. ఈ నెల 17 నుంచి 22 వరకు కెన్యా, నైరోబిలో ఈ చాంపిచన్ షిప్ జరుగబోతోంది. దీంతో కాప్రాలోని చంద్రపురి కాలనీలో ఉంటున్న అగసరి నందిని(17) ఇంటికి వెళ్లిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు నందినిని కలిసి అభినందించి, ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన నీరజ్ చోప్రాను ఆదర్శంగా తీసుకుని 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించి, భారత్ కు స్వర్ణ పథకం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 27 సభ్యులలో నందిని ఒక్కరే తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.
Nandini to participate in World Junior Athletics Championship