Saturday, November 16, 2024

విద్యుత్‌శాఖ బదిలీలో పాదర్శకతకు పాతర… కోర్టును ఆశ్రయిస్తామంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు

- Advertisement -
- Advertisement -

Power employees transfer issues

మన తెలంగాణ సిటీబ్యూరో: చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి , విద్యుత్‌శాఖలో బదిలీలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడం జరగదు. అంతా పారదర్శకంగా ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టంగా చేశారు. తీరా బదిలీల సమయం వచ్చేసరికి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సంబంధిత గైడ్‌లైన్స్‌లను పూర్తిగా పక్కన పెట్టారు. విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో ఎస్‌పిడిసీఎల్ యాజమాన్యం నిబంధలను అడుగడుగునా ఉల్లంఘించిందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అంశంపై విద్యుత్ ఇంజనీర్లు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. విద్యుత్ ఇంజనీర్ల బదిలీల కోసం ఇచ్చిన మార్గదర్శకాల ఉల్లంఘనలో అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనుకాడేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన టిఎస్‌ఎస్‌సిడిసీఎల్‌ను యాజమాన్యం తమ జేబు సంస్థగా భావిస్తున్నారని ఇంజనీర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. తాము బదిలీలన్నీ సీఎంవో ఆదేశాలకు అనుగుణంగా చేశామని చెప్పి తప్పించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. బదిలీల విషయంలో సంబంధిత ఉన్నతాధికారి ఎవరి ప్రమేయాన్ని అంగీకరించకుండా తనకు ఇష్టమైన వారికి కోరిన చోట పోస్టింగ్‌లు ఇచ్చి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ఆరోపిస్తున్నాయి.

గత 20 సంవత్సరాల క్రితం ఉద్యోగ విమరణ చేసిన వారినే సంవత్సరాలుగా సీట్లలో కూర్చోబెట్టటంతో తమకు తిరుగు లేదని సంస్థను జేబు సంస్థగా భావిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విద్యుత్ సంఘా నాయకులు ఆరోపిస్తున్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అనే పేరుతో సాగుతున్న సదరు ఉన్నతాధికారి ఇటువంటి నిబంధనలను అతిక్రమిస్తున్నారని సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం తీరు మార్చుకోక పతే ఆందోళన చేస్తామని ఆయా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

యాజమాన్యం విధించిన మార్గదర్శకాల ప్రకారం 5వ తేదీ అర్దరాత్రి తర్వాత ఒక్క బదిలీ ఇవ్వడం కూడా సాధ్యపడదు. కాని మరికొన్ని బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వకపోతే వ్యస్థ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే మెదక్ డిఈగా కృష్ణారావుకు బదిలీల్లో కేటాయించారు. కాని మెదక్ డిఈగా పని చేస్తున్న వెంకటేశ్వర్లుకు ఎలాంటి బదిలీ ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే విధంగా సంగారెడ్డి పరిధిలోని ఇస్నాపూర్,మేడ్చెల్ జిల్లా పరిధిలోని ఘటకేసర్, చర్లపల్లి ఏడీఈ పోస్టులలో ఎవరిని నియమించలేదు. ఈ పోస్టులు చాలా కీలకమైనవి, సాధారణ బదిలీలలో ఈ పోస్టును భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పోస్టుల నియమాకం కోసం లక్షలు చేతులు మారుతున్నాయని, అందువల్లనే నిబంధనలకు విరుద్దంగా అర్హత లేదని వారికి కట్టబెట్టడానికి మూడు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 5వ తేదీని అనంతరం ఎటువంటి బదిలీలు ఉండవని చెప్పిన యాజమాన్యం ప్రస్తుతం వీటిని ఎలా భర్తీ చేస్తారని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యం వ్యవహరించిందని అందువల్లే నిబంధనలకు తూట్లు పొడిచారని ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News