- Advertisement -
పాట్నా : త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తుకు తమ పార్టీ తొలి ప్రాధాన్యం ఇస్తుందని జనతాదళ్ (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో జెడియు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. అదివారంనాడిక్కడ మీడియాతో త్యాగి మాట్లాడుతూ, తమ పార్టీ మణిపూర్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. పొత్తులపై ఆధారపడకుండా ఒంటరిగా పోటీ చేసే సత్తా జేడీయూకు ఉందని ఆ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు, పార్టీ ఎంపి రాజీవ్ రంజన్ శనివారంనాడు ప్రకటించిన నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
JDU fight alone if alliance is not reached
- Advertisement -