Sunday, November 17, 2024

దేశంలో 39,070 కేసులు, 491 మరణాలు

- Advertisement -
- Advertisement -
39070 New covid-19 cases reported in india
రికవరీ రేట్ 97.39

న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 39,070,మరణాలు 491 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి, మొత్తం మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. రోజువారీ మరణాలు 500 దిగువన నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య 3,10,99,771కి చేరింది. రికవరీ రేట్ 97.39 శాతంగా, మరణాల రేట్ 1.34 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం అని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేట్ 2.27 శాతంగా, వారం పాజిటివిటీ రేట్ 2.38 శాతంగా నమోదైంది. శనివారం 17,22,221 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 48,00,39,185కి చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. దేశంలో ఆదివారం ఉదయం వరకు 50.68 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News