న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సిటిసి) మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్‌సిటిసి బుకింగ్ ఏజెంట్‌గా నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఏజెంట్‌గా ఉంటూ నెలకు రూ.80,000 వరకు సులువుగా సంపాదించొచ్చు. ఐఆర్‌సిటిసి అందించే సేవల్ని మీరు ప్రయాణికులకు చేరవేస్తూ డబ్బు సంపాదించొచ్చు. ప్రస్తుతం 55 శాతం మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్తున్నారు. వారిలో సొంతగా మొబైల్ ద్వారా టికెట్లు బుక్ చేస్తుంటే, మిగతా వారు ఐఆర్‌సిటిసి ఏజెంట్ల ద్వారా టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఆథరైజ్డ్ ఏజెంట్‌గా మారితే ప్రయాణికుల తరఫున టికెట్లు బుక్ చేసి కమిషన్ పొందొచ్చు. ప్రతీ టికెట్ బుకింగ్‌కు కమిషన్ ఉంటుంది. ఐఆర్‌సిటిసి ఏజెంట్ నాన్ ఏసీ క్లాస్ టికెట్ ఒకటి బుక్ చేస్తే రూ.20 కమిషన్ లభిస్తుంది. ఏసీ క్లాస్ టికెట్ బుక్ చేస్తే రూ.40 కమిషన్ పొందొచ్చు.
ప్రతీ రూ.2,000 లావాదేవీకి అదనంగా 1 శాతం కమిషన్ వస్తుంది. రూ.2,000 కన్నా ఎక్కువ జరిపే లావాదేవీలకు 0.75% కమిషన్ లభిస్తుంది. ఐఆర్‌సిటిసి ఏజెంట్ నెలకు ఎన్ని రైలు టికెట్ల్ అయినా బుక్ చేయొచ్చు. ప్రతీ బుకింగ్‌కు, లావాదేవీకి కమిషన్ పొందొచ్చు. ఇలా నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో కూడా నెలకు రూ.40,000 పైనే సంపాదించొచ్చు. మరిన్ని వివరాలు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.