Saturday, November 23, 2024

మరో తేేదీకి జరపండి

- Advertisement -
- Advertisement -
Telangana to abstain Godavari Board meeting
నేటి కృష్ణ,గోదావరి బోర్డుల సమావేశానికి హాజరుకాలేం
మరో తేదీని ఖరారు చేయండి
రెండు బోర్డులకు తెలంగాణ ఇరిగేషన్ ప్రధాన
కార్యదర్శి రజత్‌కుమార్ మరో సారి లేఖలు
ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జలశక్తి
శాఖ ఆదేశించినందున తప్పనిసరై సమావేశం
– తెలుగు రాష్ట్రాలకు తెలియజేసిన బోర్డులు
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు, హరిత
ట్రిబ్యునల్ కేసుల విచారణ ఉన్నందున హాజరు
కాలేమంటూ తెలంగాణ రెండోసారి లేఖలు

మన తెలంగాణ/హైదరాబాద్: బోర్డు సమావేశానికి రాష్ట్ర సభ్యులు హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చే యాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోసారి విడివిడిగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు, జా తీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని కెఆర్‌ఎంబీ, జిఆర్‌ఎంబీ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్లీ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి రజత్‌కుమార్ లేఖలు రా శారు. మరో రోజు ఈ సమావేశం ని ర్వహించాలని ఆయన బోర్డు చైర్మన్లను కోరారు. గతంలోనూ నీటిపారుదల శాఖ ఈ ఎన్సీ మురళీధర్ రెండు బోర్డులకు లే ఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్ర క్రియ ను త్వరగా పూర్తి చేయాలని కేం ద్ర జలశక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర ్వహిస్తామని, హాజరుకావాలని ఇరు బో ర్డు లు తెలుగు రాష్ట్రాలకు సూచించాయి.

ఈ నేపథ్యంలో తమకు సోమవారం కేసుల విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో మరో తేదీని సూ చించాలని కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం మ రోమారు లేఖలు రాసింది. రెండు బో ర్డుల చైర్మన్లకు నీ టిపారుదల శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ విడివిడిగా లేఖలు రాశారు. కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరుకాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని రజత్‌కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతులను కేంద్ర జలశక్తి శాఖా మంత్రి కార్యాలయం, జలవనరుల విభాగం సంచాలకులకు కూడా పంపారు.

రాష్ట్ర వైఖరిని గట్టిగా వినిపించాలి

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు కసరత్తు చేస్తున్న వేళ నీటిపారుదల శాఖపై సిఎం కెసిఆర్ వరుసగా రెండు రోజులు సమీక్షించారు. అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సిఎం రాష్ట్ర వైఖరిని గట్టిగా వెల్లడించాలని అధికారులకు సూచించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలువరించాలని కోరుతూ సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే సిఎం ఆదేశాల మేరకు కెఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ పంపారు. నేడు జరగనున్న బోర్డుల ఉమ్మడి సమావేశానికి హాజరు కావాల్సిందేనని రెండు బోర్డులు స్పష్టం చేసిన నేపథ్యంలో సంబంధిత అంశాలపై అధికారులు చర్చించారు. ఒకవేళ బోర్డు సమావేశాలకు విధిగా హాజరు కావాల్సి వస్తే అక్కడ రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలని అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ముఖ్యమైన కేసుల విచారణ ఉన్నందున భేటీకి హాజరు కాలేమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

3న ఎపి అధికారులతో రెండు బోర్డుల అధికారుల చర్చలు

బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీల సమావేశాన్ని ఈ నెల 3వ తేదీన నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, సమన్వయ కమిటీ సమావేశం తర్వాత నిర్వహిస్తామని బోర్డు సమాధానం ఇచ్చింది. తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాలేదు. చివరికి రెండు బోర్డులు ఎపి అధికారులతోనే చర్చించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News