Friday, October 18, 2024

ఆర్‌టిసిలో పిఎఫ్ కోసం ఎదురు చూపులు….

- Advertisement -
- Advertisement -

పట్టించుకోని అధికారులు


మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆర్‌టిలోసి పని చేసినరికే కాదు పిఎఫ్ తీసుకుందామనుకున్నా ఇబ్బందులే. ఆర్‌టిసిలో సుమారు 49 వేల మంది వరకుకు ఉద్యోగులు ఉన్నారు. వీరికి పిఎఫ్‌అకౌంట్ కూడా ఉంది. ఈ ఖాతా ఉన్న ప్రతి ఎంప్లాయిక్ డిపాజిట్ లింక్డ్ ఇన్‌స్యూరెన్స్ స్కీం ( ఇడ్లీస్) వరిస్తుంది. ఉద్యోగికి సర్వీసులో ఉండి చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన నెలరోజుల్లో సదరు నామినీకి డబ్బులు అందచేయాల్సి ఉంటుంది. ఇంవరకు మాగ్జిమమ్ రూ.6 లక్షల వరకు పరిహారం వస్తుండగా అది ప్రస్తుతం రూ.7 లక్షలకు పెరిగింది. మినిమమ్ రూ.2.5 లక్షల చేశారు.

ఈ నిబంధనలు 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఇతర డిపార్ట్‌మెంట్‌లలో కాకుండాఆర్‌టిసిలో మాత్రం పిఎఫ్ డబ్బులు సంస్థలోనే ఉంటాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేక ట్రస్ట్ ఉంటుంది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు యాజమాన్యం సొంతంగా వాడుకునేందుకు ఈపిఎఫ్‌వో నుంచి అనుమతి తీసుకుంది. ఉద్యోగుల నుంచి తీసుకున్న మొత్తం డబ్బులను పిఎఫ్ ఆఫీసుకు పంపించరు. ఎంప్లాయసి పెన్షన్ స్కీం కింద డబ్బులను రూ.1200 మాత్రమే పిఎఫ్‌కు జమచేస్తారు. మిగతావన్నీ ఆర్‌టిసి వద్దనే ఉంటాయి. అయితే వివిధ కారణాలతో యాజమాన్యం రూ.1288 కోట్లను వినియోగించుకుంది.

దీంతో విధినిర్వహణలో ఉద్యోగులు చేనిపోతే వారికి బీమా ఇచ్చేందుకు యాజమాన్యం వద్ద ఏమీ మిగల లేదు. ఈపిఎఫ్ చట్టం ప్రకారం ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీం( ఇడ్లీస్) డబ్బులను ఉన్నప్పుడే ఇస్తామంటే కుదరదు. తప్పకుండా నెల రోజుల్లో సదరు మొత్తాన్ని సదరునామీనికి ఇచ్చితీరాల్సిందే. యాజమాన్యం డబ్బులు తమ సొంత ఖర్చుల నిమిత్తం వినియోగించుకోవడంతో వారి వద్ద ఇచ్చేందుకు డబ్బులు లేవు. ఈ విషయం తెలియని సదరు నామినీలు చెప్పలరిగేలా కార్యాయాల చుట్టు తిరుగుతున్నారు.

గత సంవత్సరం వచ్చిన కరోనా కారణంగా అన్ని విభాగాలతో పాటు ఆర్‌టిసి సిబ్బంది కూడా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా కారణంగా సంస్థలో సుమారు 410 మంది పైగా ఉద్యోగులు మరణించినట్లు సమాచారం. కరోనాతో చనిపోతే ఎంప్లాయిస్‌కు ఇటు యాజమాన్యం కాని, అటు ప్రభుత్వం కాని ఎటువంటి ఎక్స్‌‌‌రరగేషియా ప్రకటించలేదు . కనీసం వారిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కూడా గుర్తించలేదు. వీటన్నింటిని పక్కన పెడితే కరోనా కారణంగా సదరు బీమాను కూడా ఇవ్వక పోవడంతో సదరు ఉద్యోగులు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీమా కోసం సుమారు. 25 కోట్లు అవసరం అవుతాయని అధికారులైతే అంచనా వేశారు. కాని వాటిని ఇచ్చేందుకు నిధులు లేవు, దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలు మాత్రం వీటి కోసం ఎదురు చూస్తున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇకనైనా ఆయా మొత్తాన్ని సదరుమృతుని కుటుంబాలకు చెల్లించిల ఆదుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News