Friday, November 22, 2024

టీకాలపై తప్పుడు ప్రచారం: 300 ఖాతాలపై ఫేస్‌బుక్ వేటు

- Advertisement -
- Advertisement -

Facebook bans Russian network for Corona vaccine

న్యూఢిల్లీ : ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లు వేసుకుంటే చింపాంజీలుగా మారతారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారి ఖాతాలను ఫేస్‌బుక్ నిలిపివేసింది. వీరంతా రష్యాకు చెందిన ఖాతాదారులేనని, భారతీయులు, లాటిన్ అమెరికా ఖాతాదారులనే లక్షంగా వారు ఈ పోస్టులు పెట్టినట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుంటే మనుషులు చింపాంజీలు మారతారని, తరువాత దీనికి మందు కూడా లేదని, గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని మీమ్స్, కామెంట్లు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది మే నెలలో ఇలాంటి పోస్టులే కొన్ని వెలుగు చూశాయి.

ఆస్ట్రాజెనెకాకు చెందిన కొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ పోస్టుల్లో వెలుగు చూశాయి. చింపాంజీల జన్యువుల ఆధారంగా ఆస్ట్రాజెనెకా ఓ టీకాను తయారు చేసింది. దానిపై పరీక్షలు చేసినప్పుడు దుష్ప్రభావాలు చూపించింది. ఈ వ్యాక్సిన్‌ను బహిష్కరించాలని, లేదంటే మనమంతా చింపాంజీలుగా మారతామని కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ టీకాలపై దుష్ప్రచారానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ నెల 14 నుంచి 21 తేదీ మధ్యలో దాదాపు 10 వేల హాష్ ట్యాగులు చేశారు. దీనిపై ఫేస్‌బుక్ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు 65 ఫేస్‌బుక్ ఖాతాలు, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించామని ఫేస్‌బుక్ ఉన్నతాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News