న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో హత్యకు గురైన జడ్జి ఉత్తమ్ ఆనంద్ కేసులో విలువైన సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల నగదు బహుమతిని సిబిఐ ప్రకటించింది. జులై 28న ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను వాకింగ్ చేస్తుండగా ఆటోతో ఢీకొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును జార్ఖండ్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. జడ్జి హత్యపై ఆ రాష్ట్ర హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు స్పందించాయి. సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.
దాంతో, ఇప్పుడు ఈ కేసు దర్యాప్తును హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో సిబిఐ నిర్వహిస్తోంది. జడ్జి హత్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారముంటే తమకు తెలియజేయాలంటూ ధన్‌బాద్‌లోని సిఎస్‌ఐఆర్ సత్కార్ అతిధి గృహంలోని సిబిఐ క్రైం విభాగానికి చెందిన బృందం 3 ఫోన్ నెంబర్లను ప్రకటించింది. నేరానికి సంబంధించిన విలువైన సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్టు సిబిఐ ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటివరకు ఆటోరిక్షా డ్రైవర్ లఖన్‌వర్మ, అతని అనుచరుడు రాహుల్‌వర్మలను సిబిఐ అరెస్ట్ చేసింది. కేంద్ర హోంశాఖచేత బెస్ట్ ఇన్వెస్టిగేటర్‌గా ఇటీవలే అవార్డు అందుకున్న వికె శుక్లా నేతృత్వంలోని 20మంది సభ్యుల సిబిఐ బృందం ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తోంది.