Monday, November 25, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం

- Advertisement -
- Advertisement -

MP Santosh Who Planted The Plants

జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటడం అద్భుతమైన కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్‌లు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి 75 మెడిసినల్ ప్లాంట్స్ నాటామన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని, ఎందరో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యమై కోట్లాది మొక్కలు నాటుతున్నారన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారన్నారు.జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ క్యాంపస్ లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయని, రాబోయే రోజుల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాలను ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ వారు చేస్తున్న కృషిని ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక రస్తోగి,లెఫ్టినెంట్ కల్నల్ అశోతోష్ కుమార్ , రిజిస్ట్రార్, డైరెక్టర్ (అడ్మిన్)శశి భూషణ్, ప్రగతి రిసార్ట్ చైర్మన్ జిబికె రావు, డాక్టర్ రవీందర్‌లతో పాటు ఇతర అధికారులు ,సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News