బెర్లిన్: జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ముల్లర్(75) ఆదివారం కన్ను మూశాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే బెస్ట్ స్ట్రైకర్‌గా గుర్తింపు పొందిన ముల్లర్ 1974లో జర్మనీ ఫిపా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో ముల్లర్ విన్నింగ్ గోల్ కొట్టి జర్మనీకి ప్రపంచకప్ అందించాడు. ఓవరాల్‌గా జర్మనీ తరఫున 62 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన ముల్లర్ 68 గోల్స్ చేశాడు.1970లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 14 గోల్స్ చేసి ఆల్‌టైమ్ గోల్ స్కోరింగ్‌లో ముల్లర్ రికారు సృష్టించాడు. ఇక 1964నుంచి బేయర్న్ మునిచ్ కప్‌కు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ముల్లర్ 594 మ్యాచ్‌లలో 547 గోల్స్ చేశాడు.2004లో ఫిఫా అత్యుత్తమ క్రీడాకారుల జాబితాలో ముల్లర్‌కు చోటు దక్కింది.ఈ రోజు బేయర్న్ క్లబ్‌కు, దాని అభిమానులందరికీ అత్యంత విషాదకరమైన, చెడ్డ రోజు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ముల్లర్ ఒక గొప్ప వ్యక్తి’ అని బేయర్న్ అధ్యక్షుడుహెర్బర్ట్ హైనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ముల్లర్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -