మన తెలంగాణ సిటీబ్యూరో: జిల్లాలో ఉన్న సామాజిక ఆర్దిక అంశాలపై మండలాల వారీగా ప్రామాణికమైన, విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి, ప్రభుత్వ విధానాల పర్యవేక్షణ, అంచనా, నిర్ణయం తీసుకోవడానికి , సమతుల్య, సమానమైన అభివృద్దిని నిర్దారించడాకి మార్గాలను గుర్తించడానికి ఈహ్యాండ్‌బుక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో హ్యాండ్‌బుక్ ఆప్ స్టాటిస్టిక్స్, హైదరాబాద్ జిల్లా 2020ను కలెక్టర్ ఎల్.శర్మన్ ఆవిష్కరిస్తూ గౌరవ ప్రజా ప్రతినిధులకు జిల్లా, మండల స్దాయి సమాచారం ఈహ్యాండ్‌బుక్ ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈప్రచురణలో జిల్లాకు సంబందించిన పూర్తి సమాచారం ఉందని ఇది విద్యార్దులు, పరిశోధనలకు ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, డా. ఎన్.సురేందర్, సంయుక్త సంచాలకులు ముఖ్యప్రణాళికాధికారి, శ్రీనివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జి.వి.బాను ప్రసాద్ డిపిఆర్‌ఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు హ్యాండ్‌బుక్ ఆప్ స్టాటిస్టిక్స్ ఎంతో ఉపయోగపడుతుంది: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -