Saturday, November 23, 2024

గ్రేటర్‌పై సీజనల్ వ్యాధుల ముప్పు…

- Advertisement -
- Advertisement -

దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం
గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు
డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి
జీహెచ్‌ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు

 

Dengue fever hyderabad
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై సీజనల్ వ్యాధులు ముప్పు పొంచిఉంది. వాతావరణ మార్పులో కురుస్తున్న చిరుజల్లులకు ప్రజలు పలు వ్యాధులకు గురై ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, డయేరియా వంటి రోగాలతో బాధపడుతున్నట్లు బస్తీదవఖానల వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. విషజ్వరాల వైద్యానికి పేరుగాంచిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి జ్వరాల రోగుల సంఖ్య పెరిగిపోతుంది.

రోజుకు 150మంది వరకు ఓపి ద్వారా చికిత్సలు పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా, గాందీ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఎక్కువ మంది వస్తున్నట్లు తెలిపారు. గత రెండు నెల నుంచి సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి విషజ్వరాలు రోగులు పెరిగితే తాము ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో చెత్తా చెదారం ఎక్కడిక్కడే పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నట్లు, స్దానిక మున్సిఫల్ అధికారుల ఫాగింగ్ చేయకపోవడంతో రోడ్లపై నీరు నిల్వడంతో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని స్దానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 480 డెంగ్యూ, 840 మలేరియా, 130 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి.

నగరంలో 196 బస్తీ దవాఖానలు, 56 పట్టణ అర్బన్ కేంద్రాలు ఉన్న వాటిలో రోజుకు సుమారుగా 55 నుంచి 60మందికి వైద్యం అందించినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. అక్కడ రోగుల సంఖ్య పెరిగితే ఫీవర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల వస్తే సాధారణ జ్వరం, మూడు రోజ్లులో తగ్గుతుంది, ముక్కునుంచి నీరు కారుట, కఫంతో కూడిన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. గొంతునొప్పి ,కండ్లు ఎర్రబడుట,వాంతులు విరేచనాలు ఉంటాయని వివరిస్తున్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి: వైద్యులు

నగర ప్రజలు వ్యాధుల నిర్లక్షం చేయకూడదని ఇంటితో పాటు చుట్టుపక్కల వరదనీరు లేకుండా చూడాలని, దోమతెరలు, మస్కిటో రిప్లెలంట్‌ను ఉపయోగిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి సమస్యలు నివారించవచ్చంటున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది యాంటీ మస్కిటో స్ప్రేలను చేయించాలన్నారు. వర్షంలో తడవకుండా ఉండటంతో పాటు చేతులు శుభ్రంగా కడుకోవడం, ముఖ్యంగా వృద్దులకు ప్లూ తాగడం, వెచ్చని ఆహారం తీసుకోవడం, వడపోసిన నీరుతాగడం మంచిదని, తరుచుగా చేతులు కడుకుంటే వ్యాధుల దరి చేరవని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News