చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో నేడు, రేపు పలు పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరికొన్ని జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత నెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇక ఆ తర్వాత మళ్లీ వర్షాలు రాలేదు. 20 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో మెట్ట పంటలు కొద్దిగా దెబ్బతిన్నాయి. ఇక ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం తెల్లవారు జాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు
సోమవారం తెల్లవారు జాము నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదు కాగా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 438. మిల్లీమీటర్లు, ములుగు జిల్లాలో 42, మహబూబాబాద్‌లో 33, నిర్మల్‌లో 21.3, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 51.8, జయశంకర్ భూపాలపల్లిలో 13.3, నిజామాబాద్‌లో 9.5, మంచిర్యాలలో 43.5, ఆదిలాబాద్‌లో 28.5.