ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్టు రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ఏపి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించారు. ఏపి మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, ఈ భేటీలో సిఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్‌బాబు, ఆర్.నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్.రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి. కళ్యాణ్, ఎన్వి.ప్రసాద్, కొరటాల శివ, వి.వి. వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ- వంశీ ఇలా.. నిర్మాతల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిన్న నిర్మాతల సమస్యలపైనా ఏపి సిఎంతో భేటీలో చర్చించనున్నారు.
Tollywood celebs meeting in Chiranjeevi’s House