Saturday, November 23, 2024

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఏడేళ్ల తెలంగాణ పాలనలో 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, పఠాన్‌ చెరువు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ ఓరియంటేషన్‌ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వాతంత్య్రం భారత దేశంలో దళితులు వివక్షకు గురవుతున్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దశలవారీగా దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం లక్ష్యమని చెప్పారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని, దళిత కుటుంబాలకు లాభం చేకూర్చే వరకు సిఎం కెసిఆర్‌ వదలన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, ఏడేళ్లలో 2.23లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, ఇప్పటివరకు 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామనిన మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

KTR Speech in KSPP Orientation at Gitam Campus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News