Sunday, September 22, 2024

సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

సంబురాలు చేసుకున్న టిఎన్జీఓ నాయకులు
యూసుఫ్‌బాబా దర్గాకు వెళ్లి పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు
కెసిఆర్ నిండు, నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక బోనాలు

Milk anointing to CM KCR

మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ ‘దళిత ఉద్యోగులకు దళితబంధు పథకం’ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టిఎన్జీఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎమ్.హుస్సేనీ (ముజీబ్) ఆధ్వర్యంలో నాంపల్లిలోని గృహకల్ప టిఎన్జీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. దీంతోపాటు పటాకులు పేల్చి ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ముజీబ్‌హుస్సేనితో పాటు జిల్లా సభ్యులు నాంపల్లిలోని యూసుఫ్‌బాబా దర్గాకు వెళ్లి పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక బోనాల ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్.విక్రమ్‌కుమార్, సభ్యులు కె.ఆర్.రాజ్ కుమార్, కుర్రాడి శ్రీనివాస్, ఎస్.మురళి రాజ్, బి.శంకర్, సుజాత, గీత సింగ్, జానకి, నాయక నాల్గవ తరగతి యూనియన్ నాయకులు ఎం.ఏ.ముజీబ్, సదానంద, వివిధ యూనిట్ల నాయకులు పాల్గొన్నారు.

40 వేల మంది దళిత ఉద్యోగులను అక్కున చేర్చుకునేలా ఈ పథకం ఉంది

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, మామిళ్ల రాజేందర్, టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌లు ఉద్యోగులకు దళితబందును ప్రకటించినందుకు కెసిఆర్ చిత్రపటానికి టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, మామిళ్ల రాజేందర్, టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌లు పాలాభిషేకం చేశారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టిఎన్జీఓ కేంద్ర సంఘ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్, రాయకటి ప్రతాప్‌లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల అభ్యున్నతి కోసం వారు ఆత్మాభిమానంతో తల ఎత్తుకొని సమాజంలో బ్రతకడం కోసం ఉద్ధేశించి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యావత్ భారతదేశంలో మొట్టమొదటి అన్నారు. సామాన్య దళిత కుటుంబాలకే కాకుండా ఉద్యోగవర్గంలో ఉన్న దళిత ఉద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న 40 వేల మంది దళిత ఉద్యోగులను అక్కున చేర్చుకునే విధంగా ప్రతి ఉద్యోగి దళిత బంధు పథకాన్ని ఇస్తానని సగర్వంగా ప్రకటించిన ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్, కార్యదర్శి కె. శ్రీకాంత్, కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, ఎం.సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, కార్యనిర్వాహ కార్యదర్శి ఈ.కొండల్ రెడ్డి కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు మార్కెటింగ్ శాఖ నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News