హైదరాబాద్: నగరంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో మొత్తం 158 మంది ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన విద్యార్థులు ఉన్నారని యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రొ. అప్పారావు తెలిపారు. ఈక్రమంలో ఒయూ హాస్టల్ లో నలుగురు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ రూమ్స్ అద్దె కి తీసుకుని ఉన్నారన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు ఎవరూ యుఎఫ్‌ఆర్‌వొ కార్యాలయానికి రాలేదని, మేమే స్టూడెంట్స్‌ని ట్రేస్ చేస్తున్నామన్నారు. వాళ్ళు అడ్మిషన్ టైం లో ఇచ్చిన నెంబర్స్, ఇప్పుడున్న నంబర్స్ వేరేగా ఉన్నాయనిచ అలాగే వారు ఇచ్చిన అడ్రస్ లు కూడా వేరేగా ఉన్నాయన్నారు. త్వరలోనే ఆయా విద్యార్థులను ట్రేస్ చేసి అన్నివిధాల సహకరిస్తామన్నారు. ప్రస్తుం అందుబాటులో ఉన్న విద్యార్థులను కలిసి మాట్లాడుతున్నామని, వాళ్ళకు వీసా పొడిగింపు, స్కాలర్‌షిప్ దరఖాస్తు పొడిగింపు వంటివి చేస్తామని యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రొ. అప్పారావు వివరించారు.
158 Afghanistan students in Hyderabad