మంగళూర్: భర్తను చంపిన కేసులో ఓ మహిళతోపాటు ఆమె ప్రియుడికి మంగళూర్‌లోని సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 2016లో జరిగిన సంఘటనపై సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దోషులుగా తేలిన అశ్విని, ఆమె ప్రియుడు ఆనందలకు చెరో రూ.5000 జరిమానాను కోర్టు విధించింది. సాక్షాలను ధ్వంసం చేసినందుకు మరో రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2000 జరిమానా విధించింది. 2014లో జయరాజ్ అనే వ్యక్తిని వివాహమాడిన అశ్వినికి అంతకుముందు నుంచే ఆనందతో సాన్నిహిత్యమున్నది. తమ వ్యవహారం తెలుసుకున్న జయరాజ్‌ను ఓ పథకం ప్రకారం హత్యగావించిన అశ్విని, ఆనందలు చివరికి దోషులుగా తేలారు. 2016,సెప్టెంబర్ 13న జయరాజ్‌ను హత్యగావించిన వీరిద్దరూ సాక్షాల్ని తారుమారు చేసేందుకు నాటకీయతను ప్రదర్శించారు. జయరాజ్‌కు రూ.62,000 అప్పు ఇచ్చిన ఓ వ్యక్తి బలవంతంగా తన బాకీ వసూలు కోసం కిడ్నాప్ చేసినట్టు నమ్మబలికే ప్రయత్నం చేశారు.
Woman her lover get life imprisonment for killing husband