Friday, November 22, 2024

మణుగూరు ఒసి గనిలో ‘ప్రమాదం’

- Advertisement -
- Advertisement -

Accident at Manuguru OC mine: 3 dead

బొలెరోపైకి దూసుకెళ్లిన డంపర్
ముగ్గురు కార్మికులు దుర్మరణం
అధికారుల నిర్లక్ష్యమంటున్న కార్మికులు, కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్

మన తెలంగాణ/మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలోని ఉపరితల గని-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం మణుగూరు ఓసి-2 లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు బుధవారం మధ్యాహ్నం బొలేరో వాహనంలో మైన్‌లోకి వెళ్తుండగా 100 టన్నుల సామర్ధ్యం గల డంపర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనాన్ని ఢీ కొట్టడంతో వాహనం లో ప్రయాణిస్తున్న ఇద్దరు సింగరేణి కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అజ్మీరా భాష (42) (ఎలక్ట్రీషియన్), సాగర్ (30) జనరల్ మజ్ధుర్, బులేరో వాహనం డ్రైవర్ వెల్పుల వెంకన్న (45)గా గుర్తించారు. డంపర్ డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారుణమై ఉంటుందని అధికారు లు నిర్ధారించుకున్నారు. మృతి చెందిన కార్మికులు మ ణుగూరు సింగరేణి వైద్యశాలకు తరలించారు. కార్మికుల మరణ వార్త తెలుసుకున్న తోటి కార్మికులు, కార్మికసంఘాల నాయకులు ఏరియా హాస్పిటల్‌లో మృతదేహాలను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ… అధికారుల నిర్లక్షమే తోటి కార్మికుల మృతికి కారణమని ఆరోపించారు. ఒసి-2 నందు ప్ర మాదానికి కారుణమైన డంపర్ పనిచేస్తున్న షావెల్ మరమ్మతులకు గురికావడంతో అధికారులు అనాలోచితంగా డంపర్‌ను వేరే ప్రదేశానికి తరలిస్తుండగా వెనుక ఉన్న బొలేరో వాహనాన్ని గమనించని ఆపరేటర్ దానిని వెనుక నుండి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని, ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్షమే అని వారు ఆరోపించారు. మృతుల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఏరియా హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతి చెందిన కార్మికుల్లో సాగర్ అనే కార్మొకుడు 2019లో తన తండ్రి డిపెండెంట్ ఉద్యోగం పొంది మణుగూరు ఒసి-2 నందు జనరల్ మజ్ధుర్‌గా విదులు నిర్వహిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురికి కలిచివేశాయి. ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మొకుడు వెల్పుల వెంకన్న సింగరేణి నందు బొగ్గుముఠా కార్మికునిగా పనిచేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో బొగ్గు లోడింగ్ అంతంతమాత్రంగానే ఉండటంతో సింగరేణిలో ప్రైవేటు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

కార్మికుల కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలి
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మణుగూరు ఒసి నందు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఉపరితల గని-2 నందు జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. దీనికి పూర్తిగా అధికారుల నిర్లక్షమే కారుణమని ఆరోపించారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు సింగరేణి రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు సంస్థనందు ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా ప్రమాదంలో మృతిచెందిన ప్రైవేటు కార్మొకుని కుటుంబాన్ని సైతం సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News