- Advertisement -
ఇండస్ ఇండ్ బ్యాంక్‌కు రుణం ఎగవేత
రూ.137కోట్లు తీసుకుని చెల్లించని పార్థసారథి
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కార్వి స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండిని నగర సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండి పార్థసారథి ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంకుల నుంచి దాదాపుగా రూ.720 కోట్లు రుణం తీసుకున్నాడు. అందులో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -