Saturday, November 23, 2024

తాలిబన్లపై అమెరికా డాలర్ల దెబ్బ

- Advertisement -
- Advertisement -
US dollar blow on the Taliban
10 బిలియన్ డాలర్ల నిధుల ఫ్రీజ్

వాషింగ్టన్ /కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో అధికారం చిక్కిన తాలిబన్లకు రూ 70 వేల కోట్లకు పైగా ఆర్థిక నిధి అందకుండా అమెరికా హుటాహుటిన చర్యలు చేపట్టింది. అమెరికా డాలర్లలో ఇవి దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆయుధాలు, మెరుపుదాడుల బలంతో అధికారం చేజిక్కుంచుకున్న తాలిబన్లు ఆర్థికంగా బలోపేతం కాకుండా ఉండేందుకు అమెరికాలోని అఫ్ఘనిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు స్తంభింపచేశారు. ఇక్కడి నగదు ఎట్టి పరిస్థితుల్లోనూ అఫ్ఘన్‌కు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని అధికార వర్గాలు నిర్థారించాయి. తాజాగా అమెరికాలో వెలువడ్డ ఉత్తర్వుల మేరకు అక్కడి అఫ్ఘనిస్థాన్ బ్యాంకులకు చెందిన నగదు లేదా ఆస్తుల విలువ ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు చెందదు. ఇది ట్రెజరరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆంక్షల సంబంధిత జాబితాలోకి చేరుతాయని స్పష్టం చేశారు.

తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా సమీకరించుకున్న అపార ధనం ఇతరత్రా ఆస్తులు అమెరికాలో బ్యాంకులు ఏర్పాటు చేసుకుని వాటిని పరిరక్షించుకుంటున్నారు. అయితే ఇప్పుడు అప్ఘన్‌లో పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు వారికి అత్యవసరంగా ధనం అవసరం. వారు స్పందించి అఫ్ఘన్ బ్యాంకుల ఖాతాలలోని సొమ్మును బదిలీ చేసుకునేలోగానే బైడెన్ అధికార యంత్రాంగం స్పందించి వీటిని ఫ్రీజ్ చేసేసింది. ద అఫ్ఘన్ బ్యాంక్ తాత్కాలిక హెడ్ అజ్మల్ అహ్మదీ ఓ ట్వీటు వెలువరించింది.తమ బ్యాంకులకు చెందిన డబ్బులో అత్యధికం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్‌లో, అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థలలో ఉన్నాయని , ఇవి తాలిబన్లకు చేరకుండా ఆదేశాలు వెలువడినట్లు తమకు తెలిసిందని వివరించారు.

ఈ విషయంపై అమెరికా ట్రెజరరీ వర్గాలు అధికారికంగా ఎటువంటి సయ్పందనా వెలువరించలేదు. ద ఆఫ్ఘన్ బ్యాంకు (డిఎబి) వద్ద దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన సంపద అమెరికాలోని ప్రధాన బ్యాంకులలో ఉంది. అయితే ఇందులో ఎక్కువ నగదులేదు. బంగారం, వజ్రాలు ఇతరత్రా ఆస్తుల రూపంలో ఉంది. ముందుగా తాలిబన్లకు అవసరం అయిన నగదును ఇక్కడి నుంచి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న దశలోనే అమెరికా ఈ విధంగా తాలిబన్లకు షాక్ ఇచ్చింది. పైగా గత కొద్ది వారాల వ్యవధిలోనే అఫ్ఘనిస్థాన్‌కు అవసరం అయిన డాలర్ల జారీని కూడా అమెరికా నిలిపివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News