కౌలాలంపూర్: మలేసియా నూతన ప్రధానిగా ఇస్మాయిల్ సబ్రి యాకబ్‌ను మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా శుక్రవారం ప్రకటించారు. 2018లో ఎన్నికల్లో ఓటమిపాలైన యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఇస్మాయిల్ అనూహ్య పరిణామాల మధ్య ప్రధానిగా ఎంపికయ్యారు. 18 నెలలు మాత్రమే అధికారంలో ఉన్న ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల కారణంగా మెజారిటీ కోల్పోవడంతో గత సోమవారం పడిపోయింది. ఆ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్న ఇస్మాయిల్‌కు 114 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలియచేయడంతో మలేషియా తొమ్మిదవ ప్రధానిగా శనివారం ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. 1957లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన మలేషియాకు అప్పటి నుంచి 2018 ఎన్నికల్లో ఓటమి చెందే వరకు యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ అధికారంలో ఉండి అత్యధిక కాలం ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా పేరుపొందింది. అయితే వేలాది కోట్ల డాలర్ల ఆర్థిక కుంభకోణానికి పాల్పడినట్లు ఆ పార్టీపై ఆరోపణలు రావడంతో 2018 ఎన్నికల్లో ఓటమి పాలైంది.
మలేషియా నూతన ప్రధానిగా ఇస్మాయిల్ సబ్రి యాకబ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -