Friday, November 22, 2024

వ్యాక్సిన్ తీసుకున్నా డెల్టా సోకుతోంది

- Advertisement -
- Advertisement -

Delta variant affects vaccinated people:INSACOG

30,230 శాంపిళ్లలో 20,324 డెల్టా రకం :ఇన్సాకాగ్

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సంక్రమిస్తోందని జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. అయితే, వ్యాక్సిన్లు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్ సోకినప్పటికీ మరణాల రేట్ తక్కువగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నవారి నుంచి శాంపిళ్లు తీసుకొని వేరియంట్లను గుర్తించగా, వాటిలో అధికభాగం డెల్టా వేరియంట్ల వల్లేనని తేలింది. మొత్తం 30,230 శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేయగా, వాటిలో 20,324 డెల్టా రకమేనని తేలింది. మహరాష్ట్రలో జులైలో శాంపిళ్లను తీసుకొని సీక్వెన్సింగ్ చేయగా డెల్టా ప్లస్‌తోపాటు మరో రెండు డెల్టా వేరియంట్లున్నట్టు తేలింది. దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ కేసులు 61 రికార్డయ్యాయి. ప్రస్తుతం డెట్టా వేరియంట్ చైనా, కొరియాసహా పలు దేశాల్లో ప్రభావం చూపుతోంది. ప్రభావశీల వేరియంట్లలో డెల్టా మొదటిస్ధానంలో ఉన్నది. భారత్‌లోనూ దానిదే మొదటిస్ధానం. భారత్‌లో సెకండ్‌వేవ్ కారకాల్లో దీనిదే ప్రధాన పాత్ర. 6.7 కోట్ల జనాభా ఉన్న యుకెలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18 లక్షల కేసులు నమోదు కాగా, వాటిలో 1.2 లక్షల కేసులు డెల్టా వేరియంట్‌వల్లేనని తేలింది. డెల్టా కేసులన్నీ వ్యాక్సిన్ తీసుకున్నవారివన్నది గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News