జర్మనీ జర్నలిస్టు బంధువును కాల్చిచంపిన దారుణ ఉదంతం
ప్రముఖ జర్మనీ టివి చానల్ జర్నలిస్టు కోసం ఇల్లిల్లూ సోదాలు
కాల్పుల్లో మరో బంధువుకు కూడా గాయాలు
ఈ సంస్థకు చెందిన మరి ముగ్గురు జర్నలిస్టలపైనా
తాలిబన్ల దాడి జులైలోనే హజరా మైనారిటీ తెగకు
చెందిన 9మందిని హత్య చేసినట్టు ఆమ్నెస్టీ వెల్లడి
భారత దౌత్య కార్యాలయాల్లోనూ సోదాలు
బెర్లిన్/న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన డ్యూషె వెల్లె టీవీ చా నల్‌లో పని చేస్తున్న ఓ అఫ్ఘన్ జర్నలిస్టుకోసం వేట సాగించిన అఫ్ఘన్‌లోని తాలిబన్లు ఆయన బంధువును కాల్చి చంపినట్లు ఆ చానల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో పని చేస్తు న్న ఆ జర్నలిస్టు కోసం ఉగ్రవాదులు ఇల్లిల్లూ సోదాలు నిర్వహించినట్లు సంస్థ గురువారం తెలిపింది. జర్నలిస్టుకు చెందిన మరో బంధువు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డాడని, అయితే మి గతా వారు తప్పించుకున్నారని తెలిపింది. అయితే ఈ సంఘటనకు సం బంధించి అంతకు మించి వివరాలను ఆ చానల్ తెలపలేదు. ఈ హత్యను ఆ టీవీ చానల్ డైరెక్టర్ జనరల్ పీటర్ లిం బర్గ్ తీవ్రంగా ఖండిస్తూ, అఫ్ఘనిస్థాన్‌లో మీడియా సిబ్బందికి, వారి కు టుంబ సభ్యులకు ఎంత ప్రమాదం ఉందో ఈ సంఘటన చాటుతోందని అన్నారు. తాలిబన్లు ఇప్పటికే కాబూల్‌లో, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టుల కోసం ఒక ప్రణాళిక ప్రకారం సోదాలు నిర్వహిస్తునన్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. తమ సంస్థకు చెందిన మరో ముగ్గురు జర్నలిస్టుల ఇళ్లపైనా తాలిబన్లు దాడులు జరిపినట్లు కూడా డ్యూషె వెల్లె తెలిపింది.
తొమ్మిది మంది మైనారిటీలను కిరాతంగా హత్య చేశారు: ఆమ్నెస్టీ
అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల కిరాతకం జులై నెలలోనే మొదలైందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. గత నెల అఫ్ఘన్‌లోని హజారా మైనారిటీ తెగకు చెందినవారి ఇళ్లలోకి చొరబడి లూటీలు చేసిన తాలిబన్లు చాలామందిని చిత్రహింసలు పెట్టి చంపినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. జులై 4 6తేదీల మధ్య ముందరఖ్త్ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని తాలిబన్లు ఎలా హత్య చేశారో ఘాజ్ని ప్రావిన్స్‌కు చెందిన ఓ ప్రత్యక్ష సాక్షి తమ పరిశోధకులకు చెప్పాడని మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సంస్థ శుక్రవారం తెలిపింది. వీరిలో ఆరుగురు మగవారిని కాల్చి చంపగా, మరో ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి చంపారని ఆ సంస్థ తెలిపింది. ఈ క్రూరమైన హత్యలు తాలిబన్ల గత చరిత్రను, వారి పాలన ఎలా ఉండనుందో మరో సారి గుర్తు చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చీఫ్ ఆగ్నెస్ కాలమర్డ్ చెప్పారు. ఇంకా చాలా హత్యలు జరుగుతున్నాయని, అయితే ఈ హత్యలకు సంబంధించిన ఫోటోలు పత్రికల్లో రాకుండా ఉండడం కోసం తాలిబన్లు తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సేవలను ఆపేస్తుండడంతో ఇవేవీ లెక్కల్లోకి రావడం లేదని కూడా ఆయన చెప్పారు.
భారత దౌత్యకార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నామని పైకి చెబుతున్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచకవైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత భారత్ సహా చాలా దేశాలు అఫ్ఘన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తరలించాయి. అయితే ఖాళీగా ఉన్న ఆ ఆఫీసుల్లోకి తాలిబన్లు చొరబడి కీలక పత్రాలకోసం తనిఖీ చేసినట్లు తెలిసింది. అఫ్ఘన్‌లోని కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కీలక పత్రాలు ఏమయినా దొరుకుతాయేమోనని వారు ఇలా ప్రయత్నించినట్లు సమాచారం.
అయితే అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు జలాలాబాద్, కాబూల్‌లో ఉన్న కాన్సులేట్, ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేసారా అన్న దానిపై స్పష్టత లేదు.‘ మేము దీన్ని ముందే ఊహించాం. దౌత్య కార్యాలయాలను ధ్వంసం చేసిన తాలబన్లు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలను తీసుకెళ్లారు’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గత ఆదివారం కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విజయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడంతో భారత్ అఫ్ఘన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకువచ్చింది.
దాడులు జరపబోమంటూ సందేశాలు
మరోవైపు ఈ దాడులు జరగడానికి కొద్ది రోజుల ముందు భారత్ కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని తరలించాలని తాము కోరుకోవడం లేదంటూ తాలిబన్లు భారత ప్రభుత్వానికి సందేశం పంపించారు. భారత దౌత్య సిబ్బంది, భద్రతా సిబ్బందికి ఎలాంటి హానీ తలబెట్టబోమని పేర్కొంటూ ఖతర్‌లోని తాలిబన్ కార్యాలయంనుంచి ప్రభుత్వానికి సందేశాలు అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్రసంస్థల మాదిరి తాము భారత దౌత్య కార్యాలయంపైన కానీ, సిబ్బందిపైన కానీ ఎలాంటి దాడి జరపబోమని, అందువల్ల భయపడాల్సిన పని లేదని కూడా తాలిబన్లు ఆ మెస్సేజిల్లో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్ రాజకీయ విభాగం చీఫ్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ కాబూల్, ఢిల్లీలోని తమ కాంటాక్ట్‌ల ద్వారా ఈ సందేశాలను పంపించారు. అయితే భద్రతా కారణాల దృష్టాను, ఈ ఉగ్రవాద సంస్థలనుంచి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజన్స్ వర్గాలు సూచించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కాబూల్‌నుంచి తన దౌత్య సిబ్బందిని, ఇతర ఉద్యోగులను స్వదేశానికి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది.