కరోనాతో ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడ్డ కార్మిక కుటుంబాలు
హైదరాబాద్: కరోనా మహమ్మారికి బలైన ఫ్రంట్‌లైన్ వర్కర్లను బల్దియా ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ మొదలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా పర్చడం ద్వారా పా రిశుధ్య కార్మికులు కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ విధి నిర్వహణలో భా గంగా కరోనా బారిన పడి పలువురు కార్మికులు ప్రాణాల ను కొల్పొగా వారి కుటంబాలను ఆదుకోవాల్సిన బల్దియా మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో పలు కు టుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కరోనా కారణంగా జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 42 మందికి పైగా చనిపోగా, అధికారులు మాత్రం కేవలం 26 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారులు వెల్లడించడం పట్ల కార్మికులతో పాటు ఉద్యోగ సం ఘాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ఆ 26 మంది కుటుంబాలనైనా ఆదుకుకోవడక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలను ఇచ్చి ఆదుకోవాల్సిన జిహెచ్‌ఎంసి ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
కమిషనర్ నోటా అబద్ధపు మాట
కరోనా బారిన పడి మరణించిన 26 పారిశుధ్య కార్మికులకు సంబంధించి ప్రతి కుటుంబానికి రూ. 14లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు ఇటీవల జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించడంతో అంతా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ మాట విన్న కార్మిక సంఘాల నాయకులు ఏకంగా నోరేల్లబెట్టారు. ఈనెల 11న జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పన్వార్ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఈసమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కరోనా బారిన పడి మరణించిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు రూ.14లక్షల చొప్పున ఆర్ధిక స హాయం అందజేసినట్లు కమిషనర్ తెలుపడంతో అంతా విస్తుపోయ్యారు. కమిషనర్ చెప్పినట్లుగా కరోనా బారిన పడి మరణించిన వారిలో ఏ ఒక్క కుటుంబానికి ఇప్పటీ వరకు రూ. 14 లక్షల ఆర్ధిక సహాయం అందకపోవడం గమన్హారం. ఇదే క్రమంలో రూ.14లక్షల ఆర్ధిక సహాయం మాట ఎత్తని జిహెచ్‌ఎంసి అధికారులు కరోనాతో మరణించిన కుటుంబాలకు కార్మికుడి పిఎఫ్‌తో పాటు బీమాకు సంబంధించిన డబ్బులను మాత్రం ఇప్పిస్తామని వెల్లడిస్తున్నారు.