చిదంబరం పిలుపు
న్యూఢిల్లీ: అన్ని హక్కుల కన్నా స్వేచ్ఛే సర్వోన్నతమైనదని భావించే ప్రజలందరూ 19 రాజకీయ పార్టీలు, సమాజ్‌వాది పార్టీ మద్దతిస్తున్న సమైక్యతా నినాదాన్ని బలపరచాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి నిరసనలు నిర్వహిస్తామని 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం ఒక ట్వీట్ చేస్తూ మెరుగైన రేపటి సమాజం కోసం భారత్‌ను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఐక్యతను భక్తులు ఎద్దేవా చేస్తారని, అయితే బుద్ధిహీనులతో సహా ప్రజలందరి స్వేచ్ఛ కోసం తాము పోరాడుతున్నామన్న విషయం ఏదో ఒకనాడు ఆ బుద్ధిహీనులు కూడా గ్రహిస్తారన్న జర్మన్ లూదరన్ పాస్టర్ మార్టిన్ నైమోలర్ చెప్పిన గొప్ప మాటను భక్తులు గుర్తుంచుకోవాలని చిదంబరం హితవు చెప్పారు.