- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగుతున్న జేవియర్ స్మారక అథ్లెటిక్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ అథ్లెటిక్స్‌లో పురుషులు, మహిళల సీనియర్ విభాగంలో పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఇక శనివారం నిర్వహించిన మహిళల అండర్23 విభాగం 800 మీటర్ల విభాగం పరుగులో భాగ్యలక్ష్మి (నాగర్‌కర్నూల్) విజేతగా నిలిచింది. మాలతి (ఖమ్మం) రెండో, భార్గవి (కరీంనగర్) మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పతకాలను బహూకరించారు.
- Advertisement -