Saturday, November 16, 2024

2 లక్షలకు చేరిన కియా సెల్టోస్ అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

Kia Seltos Sales Reach 2 Lakh

న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కియా ఇండియా అత్యంత వేగంగా అరుదైన మైలురాళ్లను అధిగమిస్తోంది. భారత్‌లో ఇప్పటికే మూడు లక్షల్లో సేల్స్‌ను నమోదు చేసిన కియా తన ఫ్లాగ్‌షిప్ సెల్టోస్ ఎస్‌యువి అమ్మకాలను 2 లక్షలకు పెంచుకుంది. భారత్‌లో కంపెనీ మొత్తం అమ్మకాల్లో కియయా సెల్టోస్‌నుంచే 66 శాతం అమ్మకాలు సమకూరుతున్నాయి. మొత్తం అమ్మకాల్లో కియా సెల్టోస్ డీజిల్ యూనిట్ సేల్స్ 45 శాతంగా ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన సెల్టోస్ ఐఎంటి అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయని కియా ఇండియా సేల్స్, బిజినెస్ స్ట్రాటజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టేజిన్ పార్క్ పేర్కొన్నారు. భారత కస్టమర్ల అభిరుచుల్లో మార్పుల కారణంగా దేశీయ ప్రయాణికుల వాహన మార్కెట్ మారుతోందని, అత్యాధునిక ఫీచర్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కస్టమర్లు కోరుకుంటున్నారన్నారు. రెండేళ్లలోనే కియా బ్రాండ్‌పట్ల కస్టమర్లు చూపుతున్న ఆదరణ, విశ్వాసం తమకెంతో సంతృప్తినిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News