Monday, November 25, 2024

మూడో టెస్టుకు జడేజా స్థానంలో అశ్విన్!

- Advertisement -
- Advertisement -

Ashwin replaces Jadeja for third Test

లీడ్స్ చేరుకున్న టీమిండియా

లీడ్స్: ఇంగ్లండ్‌తో ఈ నెల 25నుంచి లీడ్స్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్థానం దక్కే అవకాశముంది. తొలి రెండు టెస్టుల్లో ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్‌కు చోటు కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల్లో ఆడించినా జడేజా అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి టెస్టులో మొత్తం 16 ఓవర్లు బౌల్ చేసి ఒక్క వికెట్ కూడా సాధించలేక పోయాడు. రెండో టెస్టులోనూ మొత్తం 28 ఓవర్లు బౌల్ ఫలితం లేకపోయింది.

మరో వైపు రెండో టెస్టులోనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం లభించినా మ్యాచ్‌కు ముందు వర్షం కురవడంతో తనను తీసుకోలేదని తాజాగా తన యు ట్యూబ్ చానల్‌లో అశ్విన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మూడో టెస్టులో జడేజాను పక్కన పెట్టి అశ్విన్‌ను ఎంపిక చేసే అవకాశముంది. కాగా ప్రస్తుతం టీమిండియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ పుంజుకోవాలంటే అద్భుతం జరగాలని మాజీ సారథి సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో విజయంతో భారత్ మానసికంగా ఎంతో దృఢత్వం సాధించిందని ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో సన్నీ అన్నాడు. అయితే క్రికెట్‌లో ఏదయినా జరగవచ్చని, ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు కావచ్చని తెలిపాడు. అందుకు అద్భుతం జరగాలన్నాడు.

లీడ్స్ చేరుకున్న టీమిండియా

కాగా ఈ నెల 25నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం టీమిండియా లీడ్స్ చేరుకుంది. ఈ విషయాన్ని బిసిసిఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. రెండో టెస్టులో విజయం సాధించి 1 0ఆధిక్యత సాధించిన టీమిండియా ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించాలన్న భవనతో హెడింగ్లీ స్టేడియంలో అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News