Saturday, November 16, 2024

గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా ఉంది: ఎన్ సిడిసి ప్రతినిధుల బృందం

- Advertisement -
- Advertisement -

Minister Talasani review with Animal Husbandry Officers

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్బుతంగా ఉందని ఎన్ సిడిసి ప్రతినిధుల బృందం ప్రశంసించింది. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎన్ సిడిసి ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆదర్శనీయమని కితాబునిచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రతినిధుల బృందానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. గొల్ల, కురుమల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు.గొర్రెల పంపిణీ, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 7.61 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెలకు 1.30 కోట్ల గొర్రె పిల్లలు పుట్టాయని.. వీటి విలువ సుమారు 6,500 కోట్ల రూపాయలు ఉంటుందని మంత్రి చెప్పారు.

NCDC delegation meets Minister Talasani Srinivas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News