ప్రతి ఆదివారం విధించాలని కెటిఆర్ ఆదేశం
సందర్శకలకు అనుకూలంగా ఉండేందుకు నిర్ణయం
హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని మంత్రి కెటిఆర్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. పలువురు నగర వాసులు ట్యాంక్ బండ్‌ను వీక్షించేందుకు ట్రాఫిక్‌ను నిలువరించాలని ట్విట్టర్ ద్వారా పలువురు విజ్ఞప్తి చేయడంతో మంత్రి కెటిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ జరగనుంది. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ సమయంలో వాహనాలను ప్రత్యామ్నాయమార్గాల్లోకి మళ్లించనున్నారు. సాధారణంగా నగర వాసులు ఆదివారం సెలవు కావడంతో ట్యాంక్ బండ్‌ను సందర్శించేందుకు వస్తుంటారు. వారికి ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. వాహనాలను పార్కింగ్ చేయడం, రోడ్డు దాటడం తదితరాల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మేరకు నగర వాసులు మంత్రి కెటిఆర్‌కు ట్విటర్లో విజ్ఞప్తి చేయడంతో నిర్ణయం తీసుకున్నారు.