Saturday, November 23, 2024

అన్ని వర్గాల పేదలకూ బంధు

- Advertisement -
- Advertisement -
CM KCR Comments On BC Bandhu
వచ్చే 20ఏళ్లూ మేమే ఉంటాం
భవిష్యత్తులో బిసి, మైనార్టీ, అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేకంగా ‘బంధు’
పథకాన్ని తీసుకొస్తాం, దళితులు మిగతా వారికంటే చాలా పేదరికంలో
ఉన్నందునే ముందుగా దళితబంధు : ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రతిపక్షాలపై దాడిని పెంచాలి ఆరోపణలు,
విమర్శలపై మరింత దీటుగా స్పందించాలి
కొందరు యాక్టివ్‌గానే ఉన్నారు, మరికొందరు
తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు
దళితబంధుపై సాగుతున్న చెత్త ప్రచారాన్ని
గట్టిగా తిప్పికొట్టాలి అన్ని రకాల పార్టీ
కమిటీలు పూర్తి కావాలి : తెలంగాణ భవన్‌లో
టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి
ముఖ్యఅతిథిగా హాజరైన కెసిఆర్
2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన

 

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల పేదలను ఆదుకుంటామని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దళిత బంధు తరహాలో భవిష్యత్తులో బిసి, మైనారిటీ, అగ్రవర్ణాల పేదల కోసం ప్రత్యేకంగా బంధు పథకాన్ని తీసుకొస్తామన్నారు. దీని కోసం కూడా కసరత్తును త్వరలో ప్రారంభిస్తామన్నారు. అన్ని వర్గాల కంటే దళిత వర్గాలు చాలా పేదరికంలో ఉన్న కారణంగానే ముందుగా వారి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో మరో 20యేళ్ల పాటు టిఆర్‌ఎస్సే అధికారంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధును తీసుకొచ్చామన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకంపై దళిత వర్గాల ప్రజల్లో ఇంకా అనేక అపోహలు నెలకొని ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ పథకంపై ప్రజలను ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని అన్నారు. దళిత బంధు పధకంపై ప్రతీఊరులోనూ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పథకాన్ని ఒక ఉద్యమం వలే ఉధృతం చేయాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దళిత పథకం అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై మరింత దీటుగా స్పందించాలని పార్టీ శ్రేణులను సిఎం కెసిఆర్ సూచించారు.

ఇందులో కొందరు నేతలు యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం తమకేమి పట్టనట్లుగా ఉంటున్నారన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్ళలను నిషితంగా గమిస్తూ, వాటికి దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. ముఖంగా దేశ చరిత్రలోనే ఒక అధ్బుతమైన దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే…దీనిపై కూడా విపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ పథకంపై ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలకు దారితీసే విధంగా ప్రకటలు చేస్తున్నారన్నారు. ఈ చెత్త ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

అలాగే పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న చర్చా వేదికల్లోనూ దళిత బంధుతో పాటు వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై దీటుగా స్పందించాలని ఆదేశించారు. విపక్షాలపై మరింత ఎదురుదాడి పెరగాలన్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకునేందుకుగానూ నిర్ణిత వ్యవధిలోగా అన్ని రకాల కమిటీలను పూర్తి చేసుకోవాల్సిన అవసముందని సిఎం కెసిఆర్ అన్నారు. ముందుగా ఈ నెలాఖరు వరకు మెంబర్ షిప్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారంలో మండల కమిటీలు, మూడో వారంలో జిల్లా కమిటీలను పూర్తి చేసుకుందామన్నారు. అలాగే అక్టోబర్ నాటికి రాష్ట్ర కమిటీల ప్రక్రియను పూర్తి అవ్వాలన్నారు.ఈ కమిటీల ప్రక్రియ ముగిశాక నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించుకుందామన్నారు.

2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన

సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ (టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి) శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన అన్ని జిల్లాలోని పార్టీ కార్యాలయాలను అక్టోబర్‌లో ప్రారంభం చేస్తామన్నారు. పార్టీ కార్యాలయాలు సిద్దమవుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. .

రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు

1. టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో త్వరలోనే ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం
2. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన
3.అక్టోబర్‌లో హైదరాబాద్, వరంగల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలకు ప్రారంభించాలని నిర్ణయం
4. 2న 12,769 పంచాయతీ కమిటీల ప్రకటన
5.మండల, మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లో ఏర్పాటు
6. సంస్థాగత నిర్మాణం మొత్తం సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని తీర్మానం
7. కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీలపై సంస్థాగత నిర్మాణం
8. ప్లీనరీ సమావేశం కరోనా పరిస్థితులు చూసుకొని నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించాలని యోచన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News