- Advertisement -
హైదరాబాద్: నగరంలోని ప్రత్యేక వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుండటంతో బుధవారం సికింద్రాబాద్‌లోని రసూల్‌పురా సిబియస్ నగర్ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ప్రజలు తమంత తాముగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అధికారులు ప్రజలు టీకా వేయించుకోనేలా వందశాతం వ్యాక్సినేటెడ్ తయారు చేయాలన్నారు. ఈప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని, టీకా వేయించుకోని వారిని గుర్తించి వారు వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చి తీసుకునే విధంగా ప్రేరేపించామని చెప్పారు. అర్హులైన వారందరికి మొదటి విడుత వ్యాక్సినేషన్ జరిగేలా చూస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డా. వెంకటి, సంబందిత అదికారులు పాల్గొన్నారు.
- Advertisement -