బెర్లిన్: ఒకప్పుడు అఫ్గానిస్థాన్ ఐటి శాఖ మంత్రి, ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్. ఇదేంటి? ఇలా తారుమారు కాడానికి కారణాలేమిటి? అని వెనక్కి తిరిగి చూస్తే.. ఆయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్. 2018 వరకు అఫ్గాన్ ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. తాలిబన్ల అజెండాకు భయపడడంతో ఆపై అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాలు రావడంతో మంత్రి పదవిని వదులుకుని జర్మనీకి వెళ్లిపోయాడు. ఏ ఉద్యోగాలు రాలేదు. చేతిలో పైసాలేదు. చివరకు పిజ్జా డెలివరీ పని చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్నాడు. ప్రస్తుతం జర్మనీలోని లీవ్బిగ్లో కుటుంబంతో సంతోషంగా సురక్షితంగా ఉన్నాను.
పిజ్జా అమ్మకాలతో వచ్చిన డబ్బును దాచుకుంటున్నాను. జర్మనీ కోర్సు చేస్తూ చదువుకోవాలనుకుంటున్నాను. ఏ ఉద్యోగాలు రాలేదు, కానీ ఎలాగైనా టెలికాం కంపెనీలో పనిచేయాలన్నదే తన కోరిక అని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ డిగ్రీ పొందిన సయ్యద్ అహ్మద్ 13 దేశాల్లో కమ్యూనికేషన్ విభాగంలో 23 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. కానీ జీవితం ఇలా తారుమారు కావడమే విచిత్రం.
Ex Afghan IT Minister now works as pizza delivery boy