Saturday, November 23, 2024

భార్యపై బలాత్కారం అత్యాచారం కాదు… ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

రాయపూర్: చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భర్తను నిర్దోషిగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. బలాత్కారానికి పాల్పడినప్పటికీ చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో లైంగిక సంపర్కానికి లేదా ఏ విధమైన లైంగిక చర్యకు పాల్పడడం అత్యాచారం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఐపిసిలోని సెక్షన్ 377 కింద ఆ వ్యక్తిపై నమోదైన అభియోగాలను హైకోర్టు సమర్థించింది. తన భర్త, అత్తమామలు తనను కట్నం కోసం వేధిస్తున్నారని, గృహహింసకకు పాల్పడుతున్నారంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాక&తాను ప్రతిఘటించినప్పటికీ తన భర్త తనతో అసహజ శృంగారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్‌కె చంద్రవంశి తీర్పు వెలువరిస్తూ 18 సంవత్సరాల వయసు దాటిన భార్యతో భర్త బలవంతంగానైనా లైంగిక సంపర్కానికి లేదా లైంగిక చర్యకు పాల్పడడం అత్యాచారం కిందకు రాదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News