Friday, November 22, 2024

కొత్త ఆసరా ఫించన్ల ఎంపిక వేగవంతం

- Advertisement -
- Advertisement -

Officers Speed up new Aasara pensions

ఇప్పటివరకు లక్ష దరఖాస్తులు పరిశీలన
ఈనెలాఖరులోగా అర్హులను గుర్తిస్తామంటున్న అధికారులు
గ్రేటర్ 3.50 లక్షలకు చేరుకోనున్న ఆసరా ఫించన్లు
మరణించిన వారి పేర్లు కూడా తొలగించేందుకు కసరత్తు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. గతంలో 65 సంవత్సరాలకు పైబడిన వారికే గతంలో పంపిణీ చేస్తే చేయగా, ఇటీవల ప్రభుత్వం వయస్సు కుదించి 57 ఏళ్ల వారికి ఫించన్లు అందజేస్తామని అర్హులైన వారు మీసేవా కేంద్రాల దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో ఆశలు చిగురించాయి. దీంతో తమ వద్ద పత్రాలు తీసుకుని గత పది రోజుల నుంచి నగర ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు దరఖాస్తులు ఓటర్ లిస్టు, ఆధార్‌కార్డుల ద్వారా వయస్సు నిర్దారణ చేసి లబ్దిదారుల ఎంపిక వేగంగా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెలాఖరులోగా అర్హులను ఎంపిక చేసి వచ్చే నెలల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు 1.15లక్షల దరఖాస్తులు పరిశీలిన చేసినట్లు, మరో 80వేల వరకు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిశీలన చేసి వారి జీవితాలకు భరోసా కల్పిస్తామని చెబుతున్నారు.

గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం వృద్దాప్యం ఫించన్లు 1.42లక్షలమంది పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.వారికి ప్రతి నెల ప్రభుత్వ రూ. 2016 చొప్పన అందజేస్తుంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఫించన్లు పెరిగి వృద్దులు, వితంతులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఉన్నారని స్దానిక ప్రజలు పేర్కొంటున్నారు. కొత్త ఆసరా ఎంపిక ప్రక్రియ పూర్తి అయితే గ్రేటర్ నగరంలో ఫించన్లు సంఖ్య 3.50లక్షలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అర్హతలేకున్నా బోగస్ దృవపత్రాలు సమర్పించి ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టాలని కుట్రలు చేస్తున్నారు. దరఖాస్తుపై అనుమానం ఉంటే నేరుగా ఇంటికి వెళ్లి పరిశీంచిన చేసి ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి వృద్దులకు చేయూతనందిస్తామని స్దానిక రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. మరణించిన ఫించన్‌దారులకు సంబంధించిన నగదు చాలా చోట్ల కుటుంబ సభ్యులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని, వారి వివరాలు కూడా సేకరించి పేర్లు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News