Friday, November 22, 2024

డ్రగ్స్ కేసులో బిట్ కాయిన్ కోణం

- Advertisement -
- Advertisement -
Tollywood actress drug case

 

బిట్‌కాయిన్స్‌లావాదేవీలపై ఇడి దర్యాప్తు

హైదరాబాద్:  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నగదు లావాదేవీలు బిట్ కాయిన్ రూపంలో జరిగాయన్న కోణంలో ఇడి దర్యాప్తు వేగవంతం చేస్తోంది. డ్రగ్స్ కొనుగోలు ద్వారా విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు, డబ్బంతా ఎక్కడిది వంటి అంశాలపై ఇడి విచారణ జరుపుతోంది.ఈ బిట్ కాయిన్ల రూపంలోనే డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని ఇడి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఇడి ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే దిశగా దర్యాప్తు సాగిస్తోంది. ఇదిలావుండగా డ్రగ్ పెడ్లర్లంతా విదేశీయులేనని, గోవా, హైదరాబాద్ కేంద్రంగా వాళ్లు డ్రగ్స్ దందా చేసినట్లు ఇడి గుర్తించింది. ఇప్పటి వరకు ఇడి జరిపిన విచారణలో హవాలా లాంటి ఆర్థిక నేరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కెల్విన్‌కు అమెరికాలోని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని, అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కెల్విన్ ఆన్‌లైన్, డార్క్ వెబ్‌సైట్ లో డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అదేవిధంగా డ్రగ్స్ సరఫరాకు ఈ కేసులోని కీలక నిందితుడు కెల్విన్ కొరియర్ సర్వీస్(పోస్టల్ డిపార్ట్‌మెంట్) ద్వారా ఇంపోర్ట్స్ జరిగినట్లు ఇడి అనుమానిస్తోంది.

‘బిట్‌కాయిన్’ కోణంలో

డ్రగ్స్ సరఫరా నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా బిట్‌కాయిన్ రూపంలో జరిగినట్లు తేలడంతో ఇడి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవలి కాలంలో మాఫియా ఈ డిజిటల్ కరెన్సీల ద్వారా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, అలాగే డ్రగ్స్ మాఫియాకు చెల్లింపులు సైతం బిట్‌కాయిన్ రూపంలో చేసినట్టు ఇడి అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ఇడి సీరియస్‌గా దర్యాప్తు జరుపుతోంది.

కెల్విన్ విచారణలో కీలక అంశాలు 

టాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్‌కు అమెరికాలోని షికాగోలో ఉన్న అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఉన్నట్లు ఇడి దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచే మత్తుమందులు దిగుమతి చేసుకున్నట్లు కెల్విన్ విచారణలో వెల్లడించాడు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి అంతర్జాలం ద్వారా చెల్లింపులు చేసినట్లు చెప్పాడు. కొరియర్ల ద్వారా అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి డ్రగ్స్ దిగుమతి అయ్యేదని, మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతోపాటు తపాలా ద్వారా డ్రగ్స్ సరఫరా అయ్యేదని, వాటికి చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలోనే జరిగేదని వెల్లడించాడు.

డ్రగ్స్ కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు, డబ్బంతా ఎక్కడిది వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.ఈ బిట్ కాయిన్ల రూపంలోనే డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారనే అనుమానాలు ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగిందని గట్టిగా భావిస్తున్న ఇడి ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని భావిస్తోంది.నిజానికి డ్రగ్ పెడ్లర్లంతా విదేశీయులే. గోవా, హైదరాబాద్ కేంద్రంగా వాళ్లు డ్రగ్స్ దందాలో భాగంగా విక్రయాలు జరుపుతూ పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారు. ఆ మొత్తం నగదును వేర్వేరు రూపాల్లో సొంత దేశానికి తరలించారన్నది ఇడి అనుమానంలో భాగంగా డ్రగ్స్ కేసులో చిత్రపరిశ్రమకు చెందిన అనుమానితులకు నోటీసులిచ్చి మొత్తం కూపీ లాగాలని చూస్తోంది.

మనీ ల్యాండరింగ్ 

పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను వినియోగించినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగి ఉంటుందని ఇడి భావిస్తోంది. విదేశాల నుంచి ఎల్‌ఎస్టీ, కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఒక్క గ్రాము కొకైన్ విలువ దాదాపు పది వేల రూపాయల వరకు విక్రయించినట్లు తేలింది. ఈ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్ అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుని బిట్ కాయిన్ రూపంలో క్రయవిక్రయాలు జరిపాడని ఇడి విచారణలో తేలింది. కాగా 2017 జూలైలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసు విచారణలో పలువురు సినీప్రముఖుల పేర్లను నిందితులు వెల్లడించడం సంచలనమైంది. ఇప్పటికే సదరు సినీప్రముఖులను సిట్ విచారించింది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులను నమోదు చేసి, 30 మందిని సిట్ అరెస్ట్ చేసింది. 11 చార్జీషీట్లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేశారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు ఇడి దర్యాప్తులోనూ తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News