- Advertisement -
హైదరాబాద్ : ఎంఎస్ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) వ్యాపార రంగాల వ్యాపారులకు మద్దుతునివ్వడంతో పాటు అవగాహన కల్పించేందుకు గాను పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి) నగరంలో రుణ మేళా నిర్వహిస్తోంది. శుక్రవారం హైదరాబాద్లోని బాలానగర్లో ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ వద్ద బ్యాంక్ జోనల్ మేనేజర్ సంజీవన్ నిఖర్ ఈ రుణ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ సర్కిల్ హెడ్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ రెడ్డీ, ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎన్ఎస్ఐసి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వీరభద్ర రావు, ఎఫ్ఐఇఒ డైరెక్టర్ పి.టి.శ్రీనాథ్, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -