Friday, September 20, 2024

భారీ వర్షాలకు రాష్ట్రంలో పొంగిపొర్లుతున్న వాగులు.. (వీడియోలు)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంట పొలాల్లో మునిగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కురిసిన వర్షానికి… రాజ రాజేశ్వర దేవాలయం చుట్టూ భారీగా నీరు నిలిచి నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాల్లో నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

ఇందుర్తి వద్ద వాగు ఉప్పొంగడంతో కోహెడ- ఇందుర్తి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

జమ్మికుంటలో కురిసిన వర్షానికి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూటయాభై ఇళ్లు నీట మునిగాయి. దీంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

హుస్నాబాద్ మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు దాటే క్రమంలో వాగులో ఓ లారీ చిక్కుకుపోయింది. అయితే, లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాగు భారీగా ప్రవహిస్తుండడంతో లోయర్ మానేరు డ్యాంలోకి నీరు వచ్చి చేరుతుంది.

ఇక, నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముప్పారం వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో మూడు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు ఈసీ వాగు పంట పొలాలను ముంచెత్తుతూ హిమాయత్ సాగర్ కు పరుగెడుతుంది.

యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని పారుపల్లి నుండి రాజాపేట మధ్యన వాగు ఉదృతంగా ప్రవాహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది.

 

Heavy Rains in several Areas in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News