- Advertisement -
న్యూఢిల్లీ: బిజెపి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బిష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్ ఘోష్ విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలలో కల్లోలం సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్ అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ టిఎంసిలో చేరాలని తాను అర్థిస్తున్నానని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో టిఎంసిని వీడి బిజెపిలో చేరిన ఘోష్ గతంలో యువజన టిఎంసి బిష్ణుపూర్ పట్టణ అధ్యక్షుడిగా, స్థానిక సంస్థలో కౌన్సిలర్‌గా పనిచేశారు.
- Advertisement -