Friday, November 22, 2024

ఐసిస్ x అమెరికా

- Advertisement -
- Advertisement -

ISIS rocket attacks on Kabul airport

కాబూల్ ఎయిర్‌పోర్టుపై ఐసిస్ రాకెట్ దాడులు

విఫలం చేసిన అమెరికా సేనలు ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఒక నివాస భవనం ధ్వంసం
ఐదు రాకెట్లను ప్రయోగించిన ఐసిస్ క్షిపణి నిరోధక వ్యవస్థతో వాటిని నిర్వీర్యం చేసిన యుఎస్

కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో గగనతల సమరం వాతావరణం ఏర్పడుతోంది. కాబూల్ ఎ యిర్‌పోర్టును లక్షంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు సోమవారం ఐదు రాకెట్లను ప్రయోగించాయి. వీటిని అమెరికా సేనలు తమ క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థ సాయ ంతో నిరోధించి నేలకూల్చాయి. ఈ ఘటనలతో కల్లోలిత కాబూల్ సోమవారం మ రింత భయకంపితం అయింది. గుర్తు తెలియని శక్తులు ప్రయోగించిన ఐదు రాకెట్ల ను తమ సేనలు దెబ్బతీశాయని అమెరికా ప్రకటించింది. ఈ రాకెట్లు కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని స మీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో నే లకూలాయి. అక్కడనే ఉన్న ఓ నివాసిత భవనం దెబ్బతింది. తమ వద్ద ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ సాయంతో ఈ రాకెట్లను అటకాయించి, పనిచేయకుండా చేసినట్లు సోమవారం ఉదయం తామీ చర్యకు పాల్పడినట్లు అమెరికా సైనిక వర్గాల అధికార ప్రతినిధి క్యాప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. దేశంలో తమ సత్తా చాటుకుంటున్న ఐసిస్ కె ఇస్లామిక్ తీవ్రవాదులు , స్థానికంగా అజ్ఞాతంగా ఉంటూ దాడులకు పాల్పడుతున్న శక్తులు తరచూ రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం కాబూల్ ఎయిర్‌పోర్టును లక్షంగా చేసుకుని ఏకంగా ఐదు రాకెట్లు దూసుకువచ్చాయి.

వీటిని యుఎస్ డిఫెన్స్ సిస్టమ్‌తో విచ్ఛిన్నం చేశారని బిల్ అర్బన్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికా సేనలు తమ వద్ద ఉన్న అత్యంత అధునాతనమైన రక్షణ వ్యవస్థ అక్రోనిమ్ సి ర్యామ్‌ను వాడారు. సాధారణంగా యుద్ధ సమయాలలో రాకెట్లను నిరోధించేందుకు, అదే విధంగా ఆర్టిలరీ, మోర్టార్ సిస్టమ్‌లను నివారించేందుకు ఈ రాకెట్ నిరోధక వ్యవస్థను వాడుతుంటారు. పూర్తిస్థాయి మందుగుండు సామాగ్రి తో కూడిన రాకెట్లను దెబ్బతీశారని సైనిక ప్రతినిధి తెలిపారు. అత్యంత వేగంగా రాకెట్లు దూసుకువచ్చాయని వివరించారు. రాకెట్ల దాడి జరుగుతున్న దశలోనే ఈ సి ర్యామ్‌తో అమెరికా ఎదురుదాడికి దిగినప్పుడు కాబూల్ నగరంలో అత్యంత భిన్నమైన, డ్రిల్లింగ్ వంటి చప్పుడు మార్మోగింది. తమ సేనలు స్థానికంగా ఇప్పటికీ తమ ఆధీనంలో ఉంచుకున్న ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఈ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రయోగించారని క్యాప్టెన్ అర్బన్ చెప్పారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియ సోమవారం కూడా శరవేగంగా జరుగుతోంది. తమ పౌరులను అత్యంత జాగ్రత్తగా తరలించేందుకు అమెరికా సైనిక అధికారులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఐసిస్ ఇతర ఉగ్రవాద సంస్థ కదలికలు, వారి తదుపరి చర్యలను పసికట్టి వాటిని నిరోధించేందుకు ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ఫీల్డ్ ఇతర నిర్ణీత స్థావరాలను వాడుకుంటున్నారు.

ఇక అమెరికన్ల తరలింపు గురించి అమెరికా ఎంబసీలో ఏర్పాటు అయిన ఈ ప్రక్రియ పర్యవేక్షక అధికారి రాస్ విల్సన్ విలేకరులకు తెలిపారు. సోమవారం కూడా తరలింపు జరిగిందని , అంతా సజావుగా సాగుతోందని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు తరలివస్తున్కన అమెరికన్లను అమెరికా సేనలు కానీ, ఎంబసీ సిబ్బంది కానీ అడ్డుకోలేదని, ఈ విధంగా జరిగినట్లు వచ్చిన వార్తలు నిజం కావని స్పష్టం చేశారు. ఇప్పుడు హై రిస్క్ ఆపరేషన్ జరుగుతోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజల తరలింపు జరుగుతోంది. ఈ దశలో ఇతరత్రా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం బాధాకరమే అవుతుందని తెలిపారు. రాకెట్లతో దాడికి దిగిన వారెవ్వరు? అనేది స్పష్టం కాలేదు. ఇంతవరకూ వీటికి సంబంధించి ఏ సంస్థ కూడా బాధ్యతను స్వీకరిస్తూ ప్రకటన వెలువరించలేదు. కాబూల్‌లోని లాబ్ జార్ ఖైర్ఖానాలో ఉన్న ఖోర్‌షిద్ ప్రైవేటు యూనివర్శిటీ సమీపంలో నిలిపి ఉంచిన ఓ వాహనం నుంచి రాకెట్లు శరపరంపరగా దూసుకువచ్చాయి. రాకెట్లు, వీటిని దెబ్బతీసేందుకు అమెరికా యాంటి మిస్సైల్స్ ఆయుధాల ప్రయోగంతో కాబూల్ పరిసరాల గగనతలం అంతా చాలా సేపటి వరకూ మెరుపులతో దద్దరిల్లింది. భయానక శబ్దాలతో అఫ్ఘన్ పౌరులు దిక్కతోచని స్థితిలో ఉరుకులుపరుగులతో రోడ్లు ఎక్కారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రాకెట్ల దాడి పని మాదే ః ఐసిస్ ప్రకటన

కాబూల్ ఎయిర్‌పోర్టును టార్గెట్‌గా చేసుకుని రాకెట్లతో దాడికి దిగింది తామేనని ఇస్లామిక్ స్టేట్ వర్గాలు సోమవారం కెయిరో నుంచి ప్రకటన వెలువరించాయి. తాము కనీసం ఆరు కత్యుష రాకెట్లను వాడామని, ఇందుకు తమదే బాధ్యత అని తెలిపారు. ఈ రాకెట్లు కాబూల్ ఎయిర్‌పోర్టు సమీపంలో నేలకూలాయి. వీటికి సంబంధించిన బాధ్యతను తీసుకుంటూ ఐసిస్ మీడియా అనుబంధ సంస్థ అమాఖ్ న్యూస్‌లో వార్త పొందుపర్చారు. మరిన్ని వివరాలు అందించలేదు. అయితే ఎయిర్‌పోర్టు లక్షంగా దూసుకువచ్చిన ఐదు రాకెట్లను నేలకూల్చినట్లు అమెరికా సైన్యం తెలిపింది. రాకెట్ల దాడితో ఎయిర్‌పోర్టుకు యుఎస్ సైనిక సి 17 కార్గో జెట్ విమానాల రాకపోకల ప్రక్రియకు ఎటువంటి అవాంరాలు ఏర్పడలేదని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News