Saturday, November 23, 2024

కుక్కర్‌లో ఇరుక్కున్న బాలుడి తల

- Advertisement -
- Advertisement -

 

లక్నో: 18 నెలల పిల్లాడి తల కుక్కర్‌లో ఇరుక్కుపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. తాజ్‌నగర్ ప్రాంతంలో దంపతులకు హసన్ రజా అనే 18 నెలల పిల్లాడు ఉన్నాడు. పిల్లాడు ఒక రూమ్‌లో ఆడుకుంటుండగా తల్లి వంటగదిలో పనులు చేస్తోంది. ఒక్క సారిగా పిల్లాడు ఏడ్వడంతో రూమ్‌లోకి వెళ్లింది. కుక్కర్‌లో తల ఉండడంతో బాలుడిని ఎత్తుకొని లాలించింది. ఎంత ప్రయత్నించిన కుక్కర్ నుంచి తలను వేరు చేయలేకపోయింది. స్థానికుల సహాయంతో తీయడానికి ప్రయత్నించింది. వీలుకాకపోవడంతో వెంటనే ఎంఎం చారిటబుల్ ఆస్పత్రికి బాలుడిని తరలించారు. వైద్యులు వివిధ పరికరాల సహాయంతో కుక్కర్‌ను తీద్దామంటే వీలు కాలేదు. ఇనుమును కట్ చేసే గ్లైడర్ మెసిన్‌ను తీసుకొచ్చారు. చిన్నారి అటు ఇటు కదలుతుండడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుక్కర్‌ను కట్ చేసి తలను బయటకు తీశారు. బాలుడికి చిన్న గాయం కాకుండా బయటకు తీశారు. పిల్లాడి తల్లిదండ్రులు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోలేదని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News