రెండు గేట్ల ద్వారా దిగువకు వరద నీరు విడుదల
మూసీ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పరిస్దితులను పర్యవేక్షిస్తున్న జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు
రాబోయే రెండు రోజులు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నగరంలోని హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్‌సగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలమండలి అధికారులు మంగళవారం ఉదయం 11.30గంటలకు రెండు గేట్లును ఒక అడుగుపైకి ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న మూసీనదికిలోకి వదులుతున్నారు. సాయంత్రం ప్రవాహం మరింత పెరగడంతో 5 గంటలకు ఆ రెండు గేట్లు మరో అడుగు పైకి ఎత్తారు. దీంతో రెండు గేట్లను రెండు వరకు ఎత్తి 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ఈసందర్భంగా ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. బోర్డు సిబ్బంది మూసినదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్దితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరు అటువైపు వెళ్లొదని సూచిస్తున్నారు. అంతేగాకుండా రాబోయే మరో రెండు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంత పరిస్దితులను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను,అధికార యంత్రాగాలతో పాటు , జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ మొత్తం 17 గేట్లు ఉండగా , గత జూలై 20న జలాశయానికి నీరు పొటెత్తడంతో మూడు గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదిలారు.
హిమాయత్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం ః 1763.50 అడుగులు
ప్రస్తుత నీటిస్దాయి ః 1763.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్దం ః 2.968 టీఎంసీలు
ప్రస్తుత సామర్దం ః 2.837
ఇన్‌ప్లో ః 1000 క్యూసెక్కులు
అవుట్ ప్లో ః 1400 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య ః 17 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య ః రెండు గేట్లు