- Advertisement -
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సిబిడిటి) చైర్మన్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జెబి మహాపాత్ర నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్(ఆదాయ పన్ను) అధికారి అయిన మహాపాత్ర ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖకు విధానాలను రూపొందించే బోర్డు సభ్యుడిగా ఉన్నారు. సిబిడిటి చైర్మన్‌గా జెబి మహాపాత్ర నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ(ఎసిసి) ఆమోదించినట్లు సిబ్బంది మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మే 31న పిసి మోడి పదవీకాలం ముగిసినప్పటి నుంచి సిబిడిటి చైర్మన్‌గా అదనపు చార్జ్‌తో మహాపాత్ర వ్యవహరిస్తున్నారు.
- Advertisement -